ఇంగ్లాండ్‌కు వలస వెళ్ళే భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి ఐటీ విశేషాల సమాచారాన్ని కంప్యూటింగ్ కో యూకే వెబ్‌సైట్ అందిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వాడకందారులకు ఉపకరించే అనేక వ్యాసాల సంపుటిగా అవతరించడం ఈ సైట్ ప్రత్యేకత.
ఐటీ రంగానికి చెందిన తాజా వార్తలు, ఉద్యోగఅవకాశాలు, విజ్ఞాన కేంద్రాల సమాచారం, ఆడియో, వీడియో రూపంలో ఐటీ సమాచారం, వాణిజ్యపరంగా ఐటీ రంగపు ఉత్థానపతనాలు, ఐటీ రంగానికి మానవవనరుల లభ్యత, కంప్యూటర్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వైరస్‌ల బారి నుంచి విముక్తి, తదితరాలను ఈ సైట్‌లో చూడవచ్చు. పైన పేర్కొన్న సైట్‌ను సందర్శించేందుకు కంప్యూటింగ్ కో యూకే పై క్లిక్ చేయండి.