టెలికాం వ్యాపారులుకు ఉపకరించే వెబ్‌సైట్

గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:54 IST)
ఫోన్ ప్లస్ వెబ్‌సైట్ పత్రిక టెలికమ్యూనికేషన్ ఏజెంట్లు మరియు విక్రయదారుల ప్రయోజనార్థం సమాచారం అందించే వెబ్‌సైట్‌లలో ఒకటిగా పేరొందింది. ఇండస్ట్రీ ట్రేడ్ షోలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

అలాగే ఇతర పత్రికలకు చెందిన లింకులు కూడా ఈ సైట్‌లో లభ్యమవుతాయి. తద్వారా తాజా వార్తలు మరియు ఎంపిక చేసుకున్న కధనాలను చూడవచ్చు. టెలికాం పరిశ్రమకు సంబంధించిన వారికి ఈ వెబ్‌సైట్ ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది.

ప్రత్యేక కధనాలను చదవాలనుకునే నెటిజన్లు ఫోన్‌ప్లస్‌మాగ్ ఈ సైట్‌లో నమోదు చేసుకోవలసి ఉంటుంది. అయితే దాదాపుగా అన్ని కధనాలు ఎటువంటి నమోదు కార్యక్రమం లేకుండానే నెటిజన్లకు సులభంగా లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి