జగన్ ఆస్తుల కేసు... A-1 జగన్... A-2 విజయసాయి: సీబీఐ ఛార్జిషీట్

శనివారం, 31 మార్చి 2012 (19:09 IST)
WD
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అభియోగ పత్రాలను సమర్పించాల్సిన గడువు ఈ రోజుతో ముగియనుండటంతో సీబీఐ ఛార్జిషీటును నాంపల్లి సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నది. వారి వివరాలు...


A-1 జగన్ మోహన్ రెడ్డి
A-2 విజయసాయి రెడ్డి
A-3 అరబిందో డ్రగ్స్
A-4 హెటిరో డ్రగ్స్
A-5 ట్రెడెంట్
A-6 శ్రీనివాస రెడ్డి
A-7 నిత్యానంద రెడ్డి
A-8 శరత్ చంద్రారెడ్డి
A-9 బీపీ ఆచార్య
A-10 ఇద్దనపూడి విజయలక్ష్మి
A-11 చంద్రమౌళి
A-12 జగతి పబ్లికేషన్స్
A-13 జనని ఇన్‌ఫ్రా

మొత్తం 66 మంది సాక్షులను విచారించిన మీదట సీబీఐ అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. సాక్షుల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, బొత్స సత్యనారాయణ, ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కూడా ఉన్నారు.

నిందితులుగా పేర్కొన్న వారిపై అవినీతి నిరోధక చట్టం కింద 13/1, 13/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఇంకా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ.

వెబ్దునియా పై చదవండి