నేచురల్ స్టార్ నాని క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్ తో ప్రారంభమయ్యాయి. నాని, శ్రీనిధి శెట్టి ఈ పాటలో డాజ్లింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ రోజు, మేకర్స్ సెకెండ్ సింగిల్ - అబ్కీ బార్ అర్జున్ సర్కార్ రిలీజ్ చేశారు.