పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ జిల్లా సమీక్షలు

బుధవారం, 12 అక్టోబరు 2011 (12:37 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాస్థాయి సమీక్షలు ప్రారంభించారు.

తొలిదఫా బుధవారం తెలంగాణలోని నాలుగు జిల్లాల నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, కరీంనగర్ జిల్లాల సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదుతోపాటు కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ అంశాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లాలని జిల్లా కన్వీనర్లకు, కో-ఆర్డినేటర్లకు సూచిస్తున్నారు.

కాగా ఈ కార్యక్రమాన్ని నాలుగురోజులపాటు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ రోజు నాలుగు జిల్లాలు, రేపు మరో 5, 14వ తేదీన మరో ఐదు జిల్లాల తర్వాత మిగిలిన జిల్లాల సమీక్ష నాలుగో రోజుతో ముగుస్తుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి