జగన్ అక్రమాస్తులు: దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ!

శుక్రవారం, 30 సెప్టెంబరు 2011 (09:26 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వేగవంతం చేసింది. వేల కోట్ల రూపాయలతో, పదుల సంఖ్యలో కంపెనీలతో ముడిపడి ఉండడంతో కేసు దర్యాప్తు కోసం వివిధ విభాగాలతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయనుంది. ఇదే అంశంపై శుక్రవారం ఈడీ విభాగానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరుగనుంది.

కాగా, జగన్‌పై అక్రమాస్తులకు సంబంధించి ఈడీ విభాగం ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇదేసమయంలో జగన్ ఆస్తులపై సీబీఐ కూడా దర్యాప్తు జరుపుతోంది. జగన్ ఆస్తుల కేసు విచారణకు అవసరమైన సమాచారాన్ని ఈడి సీబీఐతో పంచుకుందన్నారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం సీబీఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ ఇప్పటికే శుక్రవారం ఢిల్లీలో ఉన్నారు. ఈయన కూడా ఈడీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి