బార్బీ బొమ్మకు యాభయ్యేళ్లు పూర్తి

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల ఆటబొమ్మ అయిన బార్బీకి సోమవారం నాటితో యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి. గడచిన యాభై ఏళ్లలో బార్బీ బొమ్మ వివిధ రూపాలలో, వినూత్న ఆహార్యాలతో పిల్లలను అలరించిన సంగతి విదితమే.

1959వ సంవత్సరం మార్చి 9వ తేదీన జరిగిన ఓ ఆటబొమ్మల ప్రదర్శనలో బార్బీ బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది. ఆ తరువాత అనతికాలంలోనే ఈ బొమ్మ ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. బార్బీ అసలు పేరు బార్బీ మిలిసెంట్ రాబర్ట్స్. జర్మనీ దేశానికి చెందిన "బిల్డ్ లిలీ" అనే బొమ్మ దీనికి మాతృక.

బిల్డ్ లిలీ బొమ్మను చూసిన న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త ఈ బార్బీ బొమ్మకు రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ బొమ్మ అనేకమైన ఆధునిక పోకడలకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ... ప్రపంచదేశాల పిల్లలను, పెద్దవారిని సైతం విశేషంగా అలరిస్తోంది.

వెబ్దునియా పై చదవండి