చుట్టుపక్కల పిల్లలతో చిన్నారులను ఆడుకోనిస్తే..?

సోమవారం, 17 నవంబరు 2014 (18:32 IST)
ఎదిగే పిల్లలను హాయిగా ఆడుకోనివ్వాలి. రెండేళ్లు పైబడిన చిన్నారులకు బ్యాటరీతో పనిచేసే వాటికన్నా జంతువులూ, ఇతర వస్తువుల బొమ్మలూ ఇచ్చి ఆడుకోమనాలి. బొమ్మలు చుట్టూ ఉంటే వారొక్కరే ఆడుకోగలుగుతారు. దీనివల్ల ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఆనందంగా ఉండే  తీరుకుని అలవాటు పడతారు. 
 
అలాగని పూర్తిగా ఒక్కరికే ఉంచినా ప్రమాదమే. రోజులో కాసేపు తల్లిదండ్రులు కలిసి ఆడాలి. చుట్టుపక్కల పిల్లలతోనూ కలిసిమెలిసి ఆడుకోనివ్వాలి. చిన్నప్పుడు బొమ్మలతోనూ, తోటిపిల్లలతోనూ ఎక్కువగా ఆడే పిల్లల్లో భయం, కంగారు వంటివి పెద్దయ్యాక తక్కువగా ఉంటాయి. రెండు, మూడేళ్ల పిల్లల్ని నిత్యం ఇంట్లోనే ఉంచకుండా చుట్టుపక్కలుండే తమ ఈడు వారితో ఆడుకోనిస్తే త్వరగా మాటలొస్తాయి. 

వెబ్దునియా పై చదవండి