తాజాగా సోషల్ మీడియా పిల్లలకూ ముప్పు తప్పదని బ్రిటన్‌లోని ఎసెక్స్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఎలాగంటే..? సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లను ఏ పిల్లలైతే తరచూ వాడుతుంటారో వాళ్ళు.. సోషల్ మీడియా ఉపయోగించని పిల్లల కంటే హ్యాపీగా ఉండలేరని తేలింది. అంతేకాకుండా సోషల్ మీడియాను తరచూ వాడే పిల్లలు.. తల్లిదండ్రులతో తరచూ గొడవకు దిగుతారని.. వారితో సంబంధాలను బలపరుచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించరని పరిశోధనలో వెల్లడి అయ్యింది.
దాదాపు మూడువేల ఐదు వందల మంది పిల్లల మీద జరిగిన పరిశోధనలో 10-15 ఏళ్ల వయస్సున్న పిల్లలు పాల్గొన్నారు. వీరిపై జరిగిన పరిశోధనలో రోజుకు ఒక రాత్రి పూట 3 గంటల పాటు ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో వారిలో కేవలం 53 శాతం మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారని వెల్లడైంది. ఎఫ్‌బీ, ట్విటర్ వంటివేవీ వాడని పిల్లలు 83 శాతం సంతోషంగా ఉండగలుగుతున్నారని ఈ పరిశోధన తేల్చింది. సో.. పిల్లలకు సోషల్ మీడియాను అలవాటు చేయకపోవడం ఎంత బెటరని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిందే..!