ఏ కూర వండినా, ఏ వంట చేసినా దాని రుచి రూపంతో ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడే పిల్లలు ఇష్టపడి తింటారు. ఉదాహరణకు ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీకి బదులు కూరగాయముక్కలన్నీ కలిపి వెజిటేబుల్ ఇడ్లీని చేయొచ్చు. అలానే పండ్లు, కూరగాయల్ని ఆకట్టుకునేలా కోసి.. వడ్డించినా సరిపోతుంది.
ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లు పిల్లలపై ప్రభావం చూపుతాయని మరిచిపోకండి. మసాలాలూ, జంక్‌ఫుడ్ తింటూ పిల్లలను మాత్రం ఫలానావే తినాలి అనడం, మీకు నచ్చని, తినని పదార్థాలను ఇంట్లో వండకపోవడం అంత సరికాదు. కాబట్టి ఇంట్లో పోషకాహారానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.