కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్‌లో వున్నాయి. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట్టునే వుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు.