సాధారణంగా గుహలంటే రాతితో ఏర్పడి ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో ఏడాది అంతటా చెక్కు చెదరకుండా ఉండే మంచు గుహలు ఉన్నాయని మీకు తెలుసా.. బయట వాతావరణానికి భిన్నంగా ఈ గుహల్లో మంచు ఏర్పడుతుంది. అమెరికా, చైనాల్లో ఉన్న ఇలాంటి వింత గుహలు విశేషాలు ఎన్నో ఉన్నాయి.
గుహ లోపల ఏర్పడిన ఆకృతి కారణంగా బయట వాతావరణంలోని వేడిగాలి లోపలికి ప్రవేశించదట. 20వ శతాబ్ధం నుంచి ఇది టూరిస్ట్ స్పాట్‌గా మారింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల దాదాపు పాతికేళ్ళుగా ఇది మూతపడి ఉంది. అయితే ఈ ప్రకృతి వింత చూసేందుకు వచ్చే సందర్సకుల కోసం రెండేళ్ళ క్రితం ఈ గుహను మళ్ళీ తెరిచారు. కానీ ఇప్పుడు కరోనా వైరెస్ భయంతో చైనాకి వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు.