వానల్లు కురవాలి.. వరిచేలు పండాలి..!

శనివారం, 13 సెప్టెంబరు 2008 (12:25 IST)
PTI PhotoPTI
వానల్లు కురవాలి... వానదేవుడా
వరిచేలు పండాలి... వానదేవుడా!
నల్లనల్ల మేఘాలు... వానదేవుడా
మెల్లంగ కురవాలి... వానదేవుడా...!

పచ్చనీ పైరులే... వానదేవుడా
ఏపుగా ఎదగాలి... వానదేవుడా!
చెరువులన్నీ నిండాలి... వానదేవుడా
ఏరులై పారాలి... వానదేవుడా...!

చేలన్నీ పండాలి... వానదేవుడా
గాదెలన్నీ నిండాలి... వానదేవుడా!
కప్పలకు పెళ్ళిళ్ళు... వానదేవుడా
గొప్పగా చెయ్యాలి... వానదేవుడా...!

వెబ్దునియా పై చదవండి