నిర్దయుండు ఖలుడు..!

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ... వినుర వేమా...!

తాత్పర్యం :
విష వృక్షమైన ముష్టి చెట్టు, చాలా చేదుగా ఉండే వేపచెట్టు.. ఈ రెండూ కూడా ఔషధాల రూపంలోనయినా సమాజానికి ఉపయోగపడుతున్నాయి. కానీ... దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు సరికదా... ఎలాంటి హాని తలపెట్టేందుకైనా వెనుకాడడని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి