పాపాలను పోగొట్టే శ్రీరామా..!

శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (12:32 IST)
FileFILE
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

తాత్పర్యం :
హారములు కలిగినవాడవు, అవిసె పూవులాంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షానివి, వికారములు లేనివాడవు, దేవతా తత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను పోషించువాడవు, పాపముల పోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలిలాంటి వాడవు అంటూ... శ్రీరామచంద్రుని భక్త రామదాసు కీర్తించాడు.

వెబ్దునియా పై చదవండి