మడుగుకు జని కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్ గడు వేడుకతో నాడెడు నడుగులు నా మదిని దలతు నచ్యుత కృష్ణా...!
తాత్పర్యం : కృష్ణా...! మహా భయంకరుడయి జనులను బాధించు కాళీయుడను పాము పడగలపై, ఎలాంటి భయమూ లేకుండా, నాట్యము చేసి దానిని హతమార్చిన నీ పాదపద్మములను నా మనస్సులో స్మరింతును తండ్రీ...!! అని ఈ పద్యం యొక్క భావం.