kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

సెల్వి

శుక్రవారం, 23 మే 2025 (19:16 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ప్రొద్దుటూర్‌లోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. వాళ్ల మూడేళ్ల బాలికను  వెంటబెట్టుకొని పెళ్లి నిమిత్తం కంబాలదిన్నేకు వెళ్లారు. 
 
అయితే మూడేళ్ల బాలిక మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలించగా.. ముళ్లపొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఏపీలో మరో అత్యాచారం..

కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం.

తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపేసి ముళ్ళ పొదల్లో పారేశాడు.

నిందితుడినీ ఉరి తీయాలని బంధువులు కోరుతున్నారు. pic.twitter.com/5zW6SlS8th

— greatandhra (@greatandhranews) May 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు