శివపూజలేలరా?

గురువారం, 25 సెప్టెంబరు 2008 (13:27 IST)
FileFILE
ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం :
మనసు నిర్మలముగా లేకుండా... ఆచారములు పాటించటంవల్ల ప్రయోజనం లేదు. శుభ్రంగా లేని పాత్రలతో చేసే వంట, మనసు స్థిరంగా లేని శివ పూజ... వ్యర్థాలే అవుతాయి తప్ప వాటివల్ల ఏమీ ప్రయోజనముండదని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి