తనకు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సినీ నటి మలత నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఆమెకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా, సుమలతకు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. ఆమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సుమలతకు సినీ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. ఆమె కోసం ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్నారు. ‘కేజీఎఫ్’ హీరో యశ్ ఇప్పటికే సుమలతకు మద్దతు ప్రకటించగా, తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ముందుకొచ్చారు.
మరోవైపు టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మోహన్‌బాబు కూడా సుమలతకు ప్రచారం చేయాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తోంది. సినీ ప్రముఖులందరూ సుమలత కోసం బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.