ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్ధూ వ్యాఖ్యలు.. ప్రచారంపై ఈసీ నిషేధం

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:58 IST)
కాంగ్రెస్ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలపాటు ప్రచారంపై నిషేధం విధించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని కతిహార్‌లో సిద్ధూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. 'నేను ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచాను. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని విభజించాలని చూస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి మీ ఓట్లు చీల్చి, విజయం సాధించాలని చూస్తున్నారు' అని  వ్యాఖ్యానించారు. 
 
ఇక్కడ ముస్లిం జనాభా 65 శాతం ఉందని, అందరూ ఐక్యంగా ఉండటం వల్ల మైనారిటీలు కాస్తా మెజారిటీగా ఉండొచ్చన్నారు. అదే జరిగితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సిద్ధూ ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందంటూ అందులో పేర్కొంది. సిద్ధు వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండిస్తూనే, 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు