Lok Sabha Elections 2024, లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13

IVR

శనివారం, 16 మార్చి 2024 (16:08 IST)
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ 2024 ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది. రెండు నెలల ఎన్నికల పోరుకు వేదికగా ఏప్రిల్ 19న ప్రారంభమై ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు.
 
ఏప్రిల్, మే నెలల్లో ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో కూడా ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.
 
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకుని రంగంలోకి దిగింది. తాజాగా వైసిపి కూడా మొత్తం అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు