[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: కేశినేని (నాని) వెంకటేశ్వర్లు (తెదేపా) వర్సెస్ పి. వరప్రసాద్ (పీవీపీ) (వైసీపి)
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీకి చెందిన కేశినేని నానినే విజయం సాధించారు. ఈసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పి. వరప్రసాద్ (పీవీపీ) బరిలోకి దిగారు. మరోవైపు జనసేన తరపున ఎమ్ఎల్ శివప్రసాద్ పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో నాని, వరప్రసాద్‌కు మధ్య గట్టిపోటీ వుంటుందని చెప్పవచ్చు.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో టీడీపికి చెందిన కేశినేని నానికి 592,696 ఓట్లు పోలయ్యాయి. అలాగే వైకాపా తరపున కోనేరు రాజేంద్ర ప్రసాద్‌కు 517,834 ఓట్లు వచ్చాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు. మే 23న ఫలితాలు మీకోసం ఇక్కడే అందిస్తాం.