అందుకే భయపడుతోంది

పార్కులో కూర్చున్న ప్రేమికులిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు
ఎందుకు రాధా ఇక్కడ కూర్చోవడానికి భయపడుతున్నావ్... అంటూ అడిగాడు రాజా.

మా నాన్న ప్రతిరోజూ ఈ పార్కుకే ఈవెనింగ్ వాక్‌కు వస్తాడు. అందుకే భయంగా ఉంది అంది రాధ.

భయపడడం ఎందుకు ఆయనగానీ వస్తే నేనే మాట్లాడి మన పెళ్లి చేయమని అడుగుతాను అంటూ ధైర్యం చెప్పాడు రాజా.

నువ్వు అలా అడిగితే మా నాన్న ఎక్కడ నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేస్తాడేమో అన్నదే నా భయం అంటూ నాలిక్కర్చుకుంది రాధ.

వెబ్దునియా పై చదవండి