shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

దేవి

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (21:19 IST)
Naga Chaitanya, Sobhita
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో  అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా టీం ‘తండేల్’ లవ్ సునామీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు. అక్కినేని నాగార్జున ఈ వేడుక ముఖ్య అతిధిగా హరజయ్యారు. నిర్మాత అశ్వినీదత్ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగచైతన్య, శోభితా దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
Akkineni Naga Chaitanya, Nagarjuna, Ashwinidat, Devisree Prasad, Allu Arvind
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. సక్సెస్ మీట్ కి వచ్చి చాలా రోజులౌతుంది. చాలా సంతోషంగా వుంది. అరవింద్ గారు కథ విని చందూ మొండేటితో తీద్దామన్నా వేళావిశేషం, దేవిశ్రీ మ్యూజిక్, బన్నీవాసు టీంని సెట్ చేసిన వేళా విశేషం, నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళావిశేషం.. ఇవన్నీ బావున్నాయి. ‘తండేల్’ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. ఫెబ్రవరి 7న సినిమా రిలీజ్ అయినప్పుడు ఢిల్లీలో వెళ్లాం. ప్రధాని మోడీ గారిని కలిశాం. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. చైతు ఫోన్ చుద్దామంటే తను త్వరగా బయటికివెళ్ళాడు. బయటకి రాగానే కంగ్రాట్స్ డాడీ అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాన్స్ నుంచి వరుసగా కంగ్రాట్స్ మెసేజ్ లు వచ్చాయి. అప్పుడు అర్ధమైయింది మా కన్నా మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందం పడుతున్నారో అని. అందుకే అన్నాను చాలా రోజులైయింది సక్సెస్ మీట్ కి వచ్చి అని. అరవింద్ కథ విని దాన్ని లవ్ స్టొరీగా చేసి అద్భుతమైన టీం ని సెట్ చేసి సినిమాని చేయడం అంత ఈజీ కాదు. కానీ అరవింద్ గారు చేశారు. థాంక్ యూ సో మచ్. 
 
ఇండియాలో ఫస్ట్  100 కోట్ల క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. గజనీ సినిమాతో ఆ రికార్డ్ అందుకున్నారు. 100 పెర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఇప్పుడు తండేల్.. మూడు సూపర్ హిట్లు.. ఒకటికి మించి ఒకటి ఇచ్చిన అరవింద్ గారికి థాంక్ యూ. బన్నీవాసు గారు అందరినీ  కన్విన్స్ చేసి సినిమాని అద్భుతంగా మలిచి రిలీజ్ చేయడంలో ఆయన సపోర్ట్ చాలా గొప్పది. చందు అంటే నాకు చాలా ఇష్టం. చైతులో నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. ఇందులో లాస్ట్ బిట్ సోల్ అఫ్ ది ఫిల్మ్. అదే కాదు ప్రతిసన్నీవేశం అద్భుతంగా మలిచాడు. వి లవ్ యూ చందు. దేవి నా ఫేవరేట్. బుజ్జితల్లి సాంగ్ అవుట్ స్టాండింగ్ హిట్. మై రాక్ స్టార్. సాయి పల్లవి గురించి ఎంతచెప్పినా తక్కువే. ఆమెలో ఇన్నోసెన్స్ బుజ్జితల్లిలో కనిపించింది. సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్. 
 
చైతు రెండేళ్ళు ఈ క్యారెక్టర్ కోసమే డెడికెటడ్ గా వున్నాడు. చాలా  ట్రాన్స్ఫర్ అయ్యాడు. షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు అంటే సముద్రంలో అని చెప్పాడు. ఎలా వుంది అంటే ..చాలా కష్టంగా వుంది. మత్స్యకారులు ఎంతకష్టపడుతున్నారో ఇప్పుడు అర్ధమైయింది. నాకు ఇంకా ఇన్స్ ప్రేషన్  వచ్చింది'అన్నాడు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చైతన్య మొహంలో నవ్వు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా అంతా ఆ లుక్, నడక, క్యారెక్టర్ ని మెంటైన్ చేసి చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఫోన్ కాల్ సీన్, బోట్ సీన్, జైలు సీక్వెన్స్ ఇలా చాలా సీన్స్ లో తన నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో చైతన్యని చూస్తుంటే నాన్నగారు గుర్తుకు వచ్చారు. అక్కినేని అభిమానులకి థాంక్ యూ. 2025లో ఇది ముహూర్తం. వస్తున్నాం కొడుతున్నాం. థాంక్ యూ వెరీ మచ్'అన్నారు.        
 
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ అఫ్ మూవీస్ తీసిన నాగార్జున గారితోనే. ఆయనతో కంటిన్యూ చేసి నాగచైతన్యతో కూడా తీయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి' అన్నారు. 
 
హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, ఇది నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్. నేను కూడా బలంగా నమ్మాను. 100 పెర్సెంట్ లవ్ నా కెరీర్ ఎలాంటి బూస్ట్ ఇచ్చిందో ఈ సినిమాకూడా అలాంటి బూస్ట్ ఇస్తుందని బిలివ్ చేశాను, అదే జరిగింది. చందు కి థాంక్ యూ. సినిమా అంత చాలా సపోర్ట్ చేస్తూ తీసుకెళ్ళారు. అల్లు అరవింద్ గారు వాసు సపోర్ట్ మర్చిపోలేను. ఇంత మంచి హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ'అన్నారు.  
 
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, చైతు పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడే  అద్భుతం అనిపించింది. అందుకే ఈ సినిమా తన కెరీర్ లో మరో ఎత్తుఅని చెప్పాను. వెడ్డింగ్ కార్డ్ సీన్ లో తన నటన అద్భుతం. ఈ సినిమా పూర్తయిన వరకు మరో సినిమా గురించి అలోచించలేదు. అలాగే చైతు తన భార్యని ఈ వేడుకు తీసుకురావడం మహాదానందంగా అనిపించింది అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, నాగార్జున గారికి డమరుకం లో చేసిన శివుని సాంగ్ చాలా పాపులర్ అయింది.చాలా రోజుల తర్వాత తండేల్ సినిమాకి చేసిన ఓం నమశ్శివాయ పాట కూడా అంతే రేంజ్ లో సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 2024 పుష్పతో ఎండ్ అయింది. 2025 తండెల్ సక్సెస్ తో బిగిన్ అయింది. సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ' అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు