మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

ఐవీఆర్

మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (23:19 IST)
పద్మవిభూషణ్ చిరంజీవి తన రాజకీయ జీవితం గురించి సంచలన ప్రకటన చేసారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటానంటూ ప్రకటించారు. బ్రహ్మఆనందం చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
 
''చాలామంది ఇటీవల నేనేదో రాజకీయాలకు దగ్గరవుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు. అందులో వాస్తవం లేదు. నేను నా జన్మంతా ఇక రాజకీయాలకు దూరంగా వుంటాను. కళామతల్లిని అక్కున చేర్చుకుంటూ సేవ చేసుకుంటాను. రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే నా లక్ష్యాన్ని, ఆశయాలను నా తమ్ముడు పవన్ కల్యాణ్ తీర్చుతున్నాడు. కనుక ఇక నేను రాజకీయాల్లోకి రానవసరంలేదు. ఈ జీవితమంతా సినిమాలకే కేటాయిస్తాను'' అని చెప్పారు.

బ్రేకింగ్ న్యూస్

రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు

చిరంజీవి సంచలన ప్రకటన

ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు

రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా… pic.twitter.com/7dWejYmFKZ

— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు