సుందరీ సుబ్బారావులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచి ఉండలేమని నిర్ణయించేసుకున్నారు. నా హృదయం నీకే అంకితమని సుందరి చేతిలో చెయ్యి వేసి మరీ చెప్పాడు సుబ్బారావు. పైచదువుల కోసం నగరానికి వెళ్ళింది సుందరి.
చదువులు ముగించుకుని కొన్ని సంవత్సరాల తరువాత స్వంత ఊరికి వచ్చిన సుందరి, సుబ్బారావు పక్కన ఎవరో యువతి ఉందడాన్ని చూసి షాక్ తిన్నది. ఏమిటీ అన్యాయమని సుబ్బారావును నిలదీసింది సుందరి. చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఊసులను మరిచిపోయావా అని సుందరి ప్రశ్నించింది. అప్పుడు సుబ్బారావు తాపీగా సమాధానమిచ్చాడు
సుబ్బారావు: నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు? ఈ మధ్యనే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది మరి. సుందరి: ఆ...