భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

సెల్వి

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (18:08 IST)
వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగితో ఓ మహిళ పారిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వడ్డీ కట్టలేక భర్త ఇబ్బంది పడుతుండటాన్ని చూసిన ఆ మహిళ.. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగితోనే జంప్ కావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే బీహార్‌, పాట్నాకు చెందిన ఇంద్రాణి కుమారి అనే మహిళకు, నకుల్ శర్మ అనే వ్యక్తితో 2022వ సంవత్సరం వివాహం జరిగింది. అయితే వివాహానికి అనంతరం నకుల్ శర్మ తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ తప్పతాగి భార్యతో గొడవకు దిగేవాడు. ఒక దశలో భర్త నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో అప్పులు చేసిన భర్త వద్ద వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన ఇంద్రకుమారికి ఆ వ్యక్తి పవన్ కుమార్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వడ్డీ కోసం పవన్ ఇంద్రాణి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడని.. ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని పోలీసులు అంటున్నారు. 
 
ఇక భర్త వేధింపులు భరించలేక ఇంద్రాణి పవన్‌తో జీవితాంతం వుండిపోవాలనుకుంది. అంతే ఇంటి నుంచి పారిపోయి ఇంద్ర-పవన్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంద్రకుమారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పవన్‌ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని.. ఇకపై నకుల్‌తో సంసారం చేయబోనని ఇంద్ర పోలీసులతో స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు