Nagarjuna, Amma Rajasekhar, Amma Ragin Raj, Esther Noronha
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా 'తల'. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. తల సినిమా ఈ 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే తలపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ప్రామిసింగ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు.