దురదృష్టానికి చిరునామా

బుధవారం, 26 డిశెంబరు 2007 (19:02 IST)
సుబ్బారావు అనారోగ్యం పాలై మంచం పట్టాడు. కోమాలోకి వెళ్ళి మధ్య మధ్యలో స్పృహలోకి వస్తున్న భర్త మంచం పక్కనే కూర్చుని సపర్యలు చేయసాగింది సుందరీ. ఎప్పటిలాగానే ఒకరోజు కోమా నుంచి స్పృహలోకి వచ్చాడు సుబ్బారావు. తన మంచం పక్కనే కూర్చుని ఉన్న సుందరీని చూసి మాట్లాడటం మొదలుపెట్టాడు.

సుబ్బారావు : సుందరీ నేను కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నువ్వు నాతోనే ఉన్నావు. నన్ను ఎవరైనా తిట్టినప్పుడు కూడా నువ్వు నా వెన్నంటే ఉన్నావు. వ్యాపారంలో దివాలా తీసినప్పుడు సైతం నన్ను వదల్లేదు. అంతెందుకు అప్పులోళ్లు మన ఇంటిని వేలం వేసినప్పుడు నువ్వు నాకు మద్దతుగా నిలిచావు. ఇక ఇప్పుడు నేను రోగంతో బాధపడుతూ మంచం పట్టిన సమయంలో సైతం పక్కనే నువ్వున్నావు. ఇదంతా చూస్తుంటే నా దురదృష్టానివి నీవేనేమో అని అనిపిస్తుంది... ఏమంటావు?
సుందరీ : ఆ....

వెబ్దునియా పై చదవండి