నాకంటే అందగత్తె ఎవరుంటారు ?

మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:33 IST)
ఓ అమ్మాయి తన గురించి ఓ అబ్బాయి దగ్గర ఇలా గొప్పలు చెప్పుకుంటోంది.
నిన్న నేను ఓ అందమైన అమ్మాయిని చూశాను తెలుసా అంది గర్వంగా...

అలాగా అన్నాడు అబ్బాయి... అందుకా అమ్మాయి అంతేనా ఆమె అందం చూస్తుంటే రెప్పవాల్చను వీలుకాలేదు తెలుసా అంటూ మళ్లీ చెప్పింది.

దాంతో ఆ తర్వాత ఏమైంది అంటూ కుతూహలంగా అడిగాడు ఆ అబ్బాయి.

ఏమౌతుంది... ఎంత అందమైతే మాత్రం ఎంతసేపని చూడగలం... అందుకే అద్దం ముందు నుంచి నేను లేచి వచ్చేశా అంటూ చెప్పింది ఆ అమ్మాయి.

వెబ్దునియా పై చదవండి