పూలతో పరారైన ప్రేమ

బుధవారం, 21 నవంబరు 2007 (19:01 IST)
అందంగా ఉండే సుగుణ ప్రేమలో రాజు పీకల్దాకా మునిగిపోయాడు. ఒక రోజు వాళ్లు పార్కులో కలుసుకున్నప్పుడు రేపు నా పుట్టినరోజని సుగుణ, రాజుతో చెప్పింది. ఇంకేముంది రాజు సంబరపడిపోయాడు. ఆమె వయస్సుకు సరితూగే సంఖ్యలో పూల బొకేను సుగుణకు పంపుతానని రాజు మాట ఇచ్చాడు.

ఆ రోజు సాయంత్రం రాజు తన ఫ్రెండు నడుపుతున్న బొకే షాపుకు వెళ్లి 21 పూలతో కూడిన బొకేకు ఆర్డరిచ్చి, సుగుణ ఇంట్లో రేపు ఉదయం డెలివరి చెయ్యమని చెప్పి ఆఫీసు పని మీద క్యాంప్ వెళ్లాడు. ఇక బొకే షాపు ఓనరు ఎంతైనా రాజుకు ఫ్రెండు కదా! ఇంకేముంది రాజు చెప్పిన 21కి అదనంగా మరో 10 పూలతో బొకేను తయారీ చేసి సుగుణ వాళ్ళింట్లో అందించాడు.

ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజు కనపడితే చాలు ముఖం తిప్పుకుని వెళ్లిపోతుంటుంది సుగుణ. ఏం జరిగిందో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు మన రాజు.

వెబ్దునియా పై చదవండి