పార్వతీశం ఇంటికి భోజనానికి వచ్చాడు గిరీశం. గిరీశానికి కావలసినవి వడ్డించమని తన భార్యను కోరే ప్రతిసారి 'ప్రియా..' 'డార్లింగ్', 'ధర్మపత్ని' తదితరాలతో పిలుస్తున్నాడు పార్వతీశం. భోజనం ముగించాక ఇద్దరు తాంబూలం వేసుకుంటుండగా పార్వతీశంతో గిరీశం అన్నాడు.
గిరీశం : నీ భార్య అంటే ప్రేమరా నీకు... పెళ్ళై ఇన్నేళ్ళు అవుతున్నా ఎంత చక్కని మాటలతో నీ భార్యను పిలుస్తున్నావ్. నీ భార్య పట్ల నీకు గల అనురాగం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. పార్వతీశం : ముచ్చటా... పాడా... ఆమె పేరు గుర్తుకు రాక అలా పిలిచాను.