భోజనానికి ప్రార్థన

శనివారం, 16 ఫిబ్రవరి 2008 (17:21 IST)
రాజు: భోజనం చేసే ముందు దేవున్ని ప్రార్థిస్తావా?
రాము: మరేం పర్వాలేదు. మా ఆవిడ వంట బాగానే చేస్తుంది.

సుబ్బారావు: నీకు ఒక సర్‌ప్రైజ్ ఇస్తున్నాను ప్రియా... లంచ్ కోసం మా స్నేహితుడు సత్యాన్ని తీసుకొస్తున్నాను.
సుందరీ: బాగుందండీ మీ చోద్యం... ఫ్రెండ్‌ను ఎవరైనా తింటారటండి.

సుబ్బారావు: సుందరీ... మనింటికి భోజనానికి మా అమ్మ వస్తుంది.
సుందరీ: ముందు మీ అమ్మగారు వంట బాగా చేస్తారో లేదో కనుక్కొని పిలవండి.

సుబ్బారావు: కాస్త విషం ఉంటే ఇస్తావూ?
సుందరీ: ఇప్పుడే తీసుకుంటారా? తర్వాత పుచ్చుకునే పనైతే పార్సిల్ కట్టి ఇస్తాను.

వెబ్దునియా పై చదవండి