రాముకు,రాధకు పెళ్ళి నిశ్చయమైపోయింది. వీలు దొరికినప్పుడల్లా ప్రేమ పక్షులు పార్కులకు, సినిమాలకు తెగ తిరిగేస్తున్నాయి. ఇలా ఉండగా రాముతో కలిసి షికారుకు వెళ్ళిన రాధ చీకటిపడే వేళకు నీరసంగా ముఖం వేలాడేసుకుంటూ ఇంటికి వచ్చింది. రాధ వాలకాన్ని చూసి వాళ్ళ అమ్మ జానకమ్మ రాధను ఇలా అడిగింది. జానకమ్మ : ఏమైందే? నువ్వు ,రాము ఏమైనా గొడవపడ్డారా? రాధ : అదేంలేదమ్మా.. జానకమ్మ : మరి డల్‌గా ఎందుకున్నావ్? రాధ : మరేమో రాము నాస్తికుడు కదా! నేను నరకం ఉంటుందంటే తను లేదంటున్నాడమ్మా జానకమ్మ : ఓసి పిచ్చి ముఖమా! ఈ మాత్రానికే దిగులు పడాలా?! రేపు మీ ఇద్దరికి పెళ్లయ్యాక మనింటికి వచ్చినప్పుడు అతడే తెలుసుకుంటాడు లేమ్మా!