అందుకే వద్దని చెప్పింది... !

సోమవారం, 6 అక్టోబరు 2008 (18:14 IST)
బీచ్‌లో కూర్చున్న ఓ ప్రేమికుల జంట ఇలా మాట్లాడుకుంటోంది.
ప్రియా నీకు పల్లీలు కావాలా... ఐస్ క్రీం కావాలా... వేరుశెనగ కాయలు కావాలా చెప్పు అంటూ గారంగా అడిగాడు ప్రియుడు

నాకు అవేవీ వద్దు ప్రియా... అంటూ మరింత గారంగా చెప్పింది ప్రియురాలు.

అదేంటి ప్రియా ఏదీ వద్దంటున్నావ్... అంటూ బుజ్జగింపుగా అడిగాడు ప్రియుడు.

పల్లీలు అమ్మేది నా తమ్ముడు, ఐస్ క్రీం అమ్మేది మా నాన్న,, వేరుశెనగ కాయలు అమ్మేది మా అక్క,,, అందుకే వద్దనేది అంటూ నింపాదిగా చెప్పింది ప్రియురాలు.

వెబ్దునియా పై చదవండి