ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటూ దాదాపు నాలుగేళ్లు కలిసి తిరిగారు కదా... ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనంటున్నావ్ అసలు విషయమేంటిరా అంటూ తన ఫ్రెండ్‌ను ప్రశ్నించాడు రాజేష్.
ఆ అమ్మాయి చాలా స్వార్థపరురాలురా... అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులని నేను ఈ పెళ్లి వద్దనుకుంటున్నానురా... అంటూ చెప్పాడు రాజేష్ ఫ్రెండ్.
ఆ అమ్మాయి స్వార్థపరురాలా ఆ విషయం నీకెలా తెలిసిందిరా... అంటూ అర్థం కాక తన ఫ్రెండ్‌ను మళ్లీ అడిగాడు రాజేష్.
నేను తనతో తప్ప వేరే ఏ అమ్మాయితో తిరగకూడదంటూ ఆ అమ్మాయి కండీషన్లు పెడుతోందిరా... నువ్వే చెప్పు తనతో తప్ప మరొకర్తో తిరగకూడదనుకునే అలాంటి స్వార్థపరురాలైన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకునేదిరా... అంటూ అసలు విషయం చెప్పాడా ఫ్రెండ్.