అలా చేసేదాన్ని కాదు

మంగళవారం, 26 ఆగస్టు 2008 (19:25 IST)
ఓ ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు

రమ్య ఏంటే అలా దిగులుగా ఉన్నావ్ అంటూ అడిగింది గీత

పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్లి చేస్తానన్నాడే అంటూ దిగులుగా చెప్పింది రమ్య

నువ్వు పరీక్షలు బాగానే రాశావు కదా మరింక ఎందుకు దిగులు అంటూ అర్థం కాక అడిగింది గీత

పరీక్షల్లో ఫెయిల్ అయితే పెళ్లి చేస్తాననే మాట మా నాన్న నాకు ముందుగానే చెప్పుంటే పరీక్షలు బాగా రాసేదాన్ని కానే అంటూ మరింత దిగులుగా చెప్పింది రమ్య.

వెబ్దునియా పై చదవండి