పెళ్ళికాని ప్రసాదు తన కలలకు సరితూగే అమ్మాయిని వెదికి పట్టుకున్నాడు. పెళ్ళికి ముందు తన కాబోయే భార్యను తల్లికి పరిచయం చేస్తే మంచిది కదా అనుకున్నాడు. అదే సమయంలో మన ప్రసాదుకు వెరైటీ ఆలోచన వచ్చింది. తనకు నచ్చిన అమ్మాయితో పాటు మరో ఇద్దరు అమ్మాయిల్ని తల్లికి పరిచయం చేయాలన్నది ప్రసాద్ ఆలోచన.
అంతే కాదు ముగ్గురిలో మన ప్రసాదుకు నచ్చిన అమ్మాయి ఎవరో తల్లి గుర్తు పట్టాలి. ప్రసాదు ఆలోచనకు వాళ్ళ అమ్మ ఒప్పుకుంది. అదే రోజు సాయంత్రం ముగ్గురు అమ్మాయిలను వెంటపెట్టుకుని పెళ్ళికాని ప్రసాదు ఇంటికి వచ్చాడు. పరిచయాలు, పరామర్శలు, కుశలప్రశ్నలు, లోకాభిరామాయణంతో ముగ్గురు అమ్మాయిలు ప్రసాద్ వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడారు.
అమ్మాయిలు వెళ్ళిపోగానే ప్రసాద్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు.
ప్రసాద్ : ముగ్గురిలో ఎవర్ని నన్ను పెళ్ళి చేసుకోమంటావు? అమ్మ : ముగ్గురిలో మధ్యలో కూర్చున్నది చూసావు. ఆ అమ్మాయిని... ప్రసాద్ (ఆశ్చర్యంగా) : అంత ఖచ్చితంగా ఎలా కనుక్కున్నావమ్మా నాకు నచ్చిన అమ్మాయిని.... అమ్మ : చాలా సులభంరా... నాకు ఆ అమ్మాయి నచ్చలేదు....