రాధ లేని హృదయం

బుధవారం, 21 నవంబరు 2007 (19:00 IST)
రాము, రాధ గాఢంగా ప్రేమించుకున్నారు. ముఖ్యంగా రాము ప్రేమ ఎంత గాఢమైనదంటే... నీకు తప్ప నా హృదయంలో మరొకరికి చోటు లేదంటూ రాము, రాధ చేతిలో చేయి వేసి మరీ చెప్పాడు. ఇదిలా ఉండగా పై చదువుల కోసం రాధ, రాముకు దూరంగా వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. పైచదువులు ముగించుకుని తిరిగి వచ్చిన రాధ, రాము పక్కన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే రాముని నిలదీసింది రాధ.

రాధ : రాము.. నాకు చేసిన బాసలు మరిచిపోయావా?
రాము : నిన్ను నా హృదయంలోనే దాచుకుందామనుకున్నాను. కానీ...
రాధ : ఆ.. కానీ... చెప్పు... నీళ్ళు నములుతావేఁ..
రాము : అదీ... రాధ... నాకు ఈ మధ్యనే గుండె ఆపరేషన్ జరిగింది..మరి..
రాధ : ఆఆఆ....

వెబ్దునియా పై చదవండి