నిన్ను ప్రేమించినందుకు... నువ్ నన్ను మరిచిపొమ్మన్నందుకు... గుండె పగిలేలా ఏడవాలని ఉంది. కానీ...! నా కనులకు నాపై కరుణ లేదు. కనీసం ఓ కన్నీటి చుక్కను రాల్చనంటున్నాయి. దేవుడా...! నాకెందుకీ శిక్ష? అని గట్టిగా అరవాలని ఉంది. కానీ...! నా పెదవులు నుంచి మాట పెగలడం లేదు. నీ చేతిలో మోసపోయానని ఆ సమయం కూడా... టిక్.. టిక్.. అంటూ నన్ను వెక్కిరిస్తోంది. కనులుండి గుడ్డి వాడినయ్యాను... నోరుండి మూగ వాడినయ్యాను...
మొత్తానికి నిన్ను ప్రేమించినందుకు పిచ్చి వాడినయ్యాను.