ప్రియతమా! ఏమని పిలువను... మనసు అలజడితో ఊగుతున్నప్పుడు.. నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు.. బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..
నేనున్నానంటూ పలకరించావు నీకు నువ్వు నాకు నేను అంటూ మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..
ప్రపంచం సాక్షిగా.. మనం నడకను కొనసాగిద్దామంటూ... మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...