ప్రియా... నీ కమనీయ స్పర్శ నా జీవితానికే పరామర్శ

మంగళవారం, 5 మార్చి 2013 (17:56 IST)
WD
ప్రియా
నీ నవ్వుల హరివిల్లు
నా జీవితపు పొదరిల్లు
నీ కనుల పలకరింపు
నా జీవితానికి గుభాళింపు
నీ తీయని పలుకులు
నా ఎదను మీటే మధుర రాగాలు
నీ కమనీయ స్పర్శ
నా జీవితానికే పరామర్శ

నీ తలపుల్లో వసంతాలు నడిచొస్తాయి
నీ చూపుల్లో ఉషోదయాలు కనిపిస్తాయి
నీ అందెల సవ్వడిలో సప్త స్వరాలు వినిపిస్తాయి

సఖీ
నీవు కనిపిస్తావేమోనని
కలలు కంటాను
నీ పిలుపు వినిపిస్తుందేమోనని
నిశ్శబ్దాన్నీ వింటాను
నీకోసం.. నీ పిలుపుకోసం నా ఆరాటం

వెబ్దునియా పై చదవండి