మీ బాయ్ ఫ్రెండ్‌కు నచ్చేవిధంగా ఉండాలంటే?

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (16:19 IST)
మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. అతనికి నచ్చే విషయాలను చేసేందుకు ప్రయత్నిస్తున్నారా.. అయితే అమ్మాయిలకే తెలియని.. మీ ప్రియుడికి మీలో నచ్చని కొన్ని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
 
అవేంటంటే.. పొడవాటి గోళ్లు మీ బాయ్ ఫ్రెండ్ నచ్చకపోవచ్చు. వాటిని సరళంగా ఉంచడం.. కొట్టే రంగులతో పాలిష్ పెట్టుకోవడం కంట్రోల్ చేయండి. అలాగే సెంట్స్.. వాడకంలోనూ అప్రమత్తంగా ఉండండి. మీకు నచ్చే సెంట్ అయినా అతి సుగంధభరితంగా ఉండే పెర్ఫ్యూంలను వాడకం మానేయాలి.
 
అలాగే అతనిలోని తప్పులను పదే పదే ఎత్తి చూపడం.. ప్రతీసారి అనవసరంగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించడం వంటి లక్షణాలు మీ బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చకపోవచ్చు. కాబట్టి వాటిని కాస్త తగ్గించుకోవడం ద్వారా మీ బాయ్ ఫ్రెండ్‌కు మీరు ఇంకా నచ్చినవారవుతారని మానసిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి