శివుడు మహాదేవుడెలా అయ్యాడు...?

మంగళవారం, 5 మార్చి 2013 (19:01 IST)
WD
నీలకంఠుడు అన్న నామం శంకరునకు గల నామాలలో ప్రసిద్ధమైనదే. శివుడు అంటే కళ్యాణ కార్యేచ్ఛగలవాడు. నిరంతరం విషయపానానికి అంటే భయంకర ఘట్టాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ధైర్యంగా ఉండాలి. క్షీరసాగర మథనవేళలలో ప్రాదుర్భవించిన రత్నాలను అందరూ తీసుకున్నారు.

దేవతలందరూ అమృతాన్ని పానం చేశారు. కానీ హాలాహలం పుట్టడంతో సర్వులూ భీతి చెంది పారిపోయారు. కేవలం శంకర భగవానుడు మాత్రమే దానిని పానం చేయగలిగాడు. అమృతాన్ని పానం చేసినవాడు దేవుడైతే విషాన్ని పానం చేసి మహాదేవుడయ్యాడు ఆ పరమేశ్వరుడు.

వెబ్దునియా పై చదవండి