కాశ్మీర్ పర్యాటక రంగంపై 'అమర్‌నాథ్' ప్రభావం

FileFILE
దేశంలోని అతి సుందరమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రదేశాల్లో కాశ్మీర్ ఒకటి. ఇక్కడి ప్రకృతి రమణీయ అందాలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పోటీ పడుతూ వస్తుంటారు. అయితే.. తీవ్రవాదుల ఆగడాలు ఈ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మార్చాయి. దీంతో సమారు రెండు దశాబ్దాల పాటు కాశ్మీర్ అందాలు చూసే భాగ్యాన్ని పర్యాటకులు కోల్పోయారు.

అయితే.. గత ఐదేళ్లుగా భద్రతా దళాలు చేట్టిన గట్టి చర్యల కారణంగా.. తీవ్రవాదుల ఆగడాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో క్రమేణా పర్యాటకలు ఈ రాష్ట్రానికి రాసాగారు. ఇందుకు నిదర్శనం.. గత ఏడాది రికార్డు స్థాయిలో 5.5 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చినట్టు అధికారిక లెక్కలు చెపుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు భూముల కేటాయింపు, రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్‌ను మరోసారి అల్లకల్లోలంగా మార్చివేసింది. 19 సంవత్సరాల నాటి పరిస్థితులు తలపించేలా అక్కడి వాతావరణం నెలకొంది. ఇది ఆ రాష్ట్ర పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.

కొద్ది రోజుల పాటు సాగిన ఆందోళనల్లో పలువురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. దీనివల్ల పర్యాటక రంగం రూ.300 కోట్ల మేరకు నష్టపోయినట్టు సమాచారం. ఇదే పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగిన పక్షంలో కాశ్మీర్ పర్యాటక రంగం నష్టాల ఊబిలో కూరుకుని పోవడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి