సోనియా గాంధీ, ఆజాద్‌ల మధ్య తెలంగాణ అంశంపై చర్చ!!

బుధవారం, 9 నవంబరు 2011 (09:19 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కలిశారు. వారిద్దరి మధ్య తెలంగాణ అంశంపైన మంగళవారం సాయంత్రం అర్థ గంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. తెలంగాణపై బక్రీద్ తర్వాత నిర్ణయం వస్తుందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై ఆజాద్ సోనియాకు ఓ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం నవంబర్ ఒకటో తేదీన నుంచి నల్లగొండలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటీవల హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేర్చిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కూడా సోనియా గాంధీ దృష్టికి ఆజాద్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనతో దీక్షను విరమింపజేసే విషయంపై కూడా సోనియాకు, ఆజాద్‌కు మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి