చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించేవారు ఇకమీద బారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి భారతీయ వీసా ఫార్మాట్‌నే సవరించవలసిన అవసరం ఉందని కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి వారిని దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చేయడానికి మన వీసా ఫార్మాట్‌లోనే మార్పు చేయాలని ఆమె విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు.
బాలబాలికలను వేధించినట్లుగా నేర రికార్డు కలిగిన విదేశీ జాతీయులు భారత్‌లో అడుగుపెట్టలేని విధంగా మన వీసా ఫార్మాట్‌ను మార్చవలసిన అవసరముంది సుష్మాజీ, ఇంతవరకు విదేశీయులు తమపై జరిగిన నేర విచారణ రికార్డును ప్రకటించవలసిన అవసరం లేదు. కానీ ఇకనుంచి మాత్రం విదేశీయుల క్రిమినల్ రికార్డును పొందుపరుస్తూ ఒక డిక్లరేషన్‌ని భారత వీసా ఫార్మాట్లో పొందుపర్చాలి అంటూ మనేకా ట్వీట్ చేశారు.