విరిగిపడిన మంచు చరియలు.. 10 మందితో ఉన్న వాహనం సమాధి.. ఎక్కడ?

శుక్రవారం, 18 జనవరి 2019 (11:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో పది మందితో వెళుతున్న స్కార్పియో వాహనం ఒకటి మంచు పెళ్లల కింద సమాధి అయిపోయింది. ఈ వాహనం కోసం ఇండియన్ ఆర్మీ భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లడఖ్ ప్రాంతంలో 10 మందితో స్కార్పియో వాహనం వెళుతోంది. ఆ సమయంలో ఉన్నట్టుండి భారీ మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ వార్త తెలియగానే రంగంలోకి దిగిన సైనిక సిబ్బంది.. భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. 
 
కాగా, మన దేశంలో అత్యంత ఎత్తున ఉన్న రహదారుల్లో ఖర్దూంగ్ లా పాస్ రహదారి కూడా ఒకటి. లేహ్ కు ఉత్తర ప్రాంతంలో షయోక్, నుబ్రా లోయలను కలుపుతూ ఈ రహదారి ఉంటుంది. ఈ 10 మందిలో ఒకరు మృతి చెందగా, మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు