గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బా డ్యాన్స్ చేస్తూ పలువురికి గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. బాధితులు యువకులు, మధ్య వయస్కులే కావడం ఆందోళనకరం. బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా మృతుల్లో ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది.