తిరుచ్చిలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది సజీవదహనం

గురువారం, 1 డిశెంబరు 2016 (09:46 IST)
తమిళనాడులో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తిరుచ్చిలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనం అవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తిరుచ్చి జిల్లా తురైయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని ఓ మందుగుండు తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించింది. మందుగుండు గోడౌన్‌లో అనేక మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లలో 20 మంది మృతిచెందారని ప్రాథమిక సమాచారం. మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
ఇక్కడి నుంచి బాణసంచా తయారీకోసం వివిధ ప్రాంతాలకు పంపేందుకు మందుగుండు తయారుచేస్తారు. ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఏడు వాహనాల్లో అక్కడకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్నవారని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. 

తురైయూర్‌ ప్రాంతంలో గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాణసంచా కర్మాగారంలో మంటలు వ్యాపించడంతో 20 మంది సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేస్తున్నారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకునిఘటనపై విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి